: కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం పైలాన్ ను ఆవిష్కరించిన చంద్రబాబు


కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఫెర్రీ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం పైలాన్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నదుల అనుసంధానం ప్రాశస్త్యంపై ఈ పైలాన్ ను ఏర్పాటు చేశారు. పైలాన్ కు ఇరువైపులా కృష్ణా, గోదావరి మాతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కాగా, ఈ కార్యక్రమం తరువాత ఇబ్రహీంపట్నం బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3.45 గంటలకు పట్టిసీమ వెళ్లనున్నారు. అంతకుముందు చంద్రబాబు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News