: యూజర్ల కోరికను తీర్చనున్న ఫేస్ బుక్!


ఫేస్ బుక్ ఖాతాదారులు ఎంతో కాలంగా కోరుతున్న 'డిజ్ లైక్' బటన్ త్వరలోనే సాక్షాత్కరించనుంది. ప్రస్తుతం 'డిజ్ లైక్' బటన్ ను ఫేస్ బుక్ కు జోడించే పనిలో ఉన్నామని, త్వరలోనే దీన్ని పరీక్షిస్తామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా వెల్లడించారు. కాలిఫోర్నియాలోని మెన్లో పార్కులో జరిగిన ఓ సమావేశంలో ప్రసంగించిన ఆయన, తమ యూజర్లు చాలా మంది ఈ బటన్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటున్నారని, వారి కోరిక తీర్చే లక్ష్యంతో ఈ బటన్ అందిస్తున్నామని తెలిపారు. కొన్ని బాధకలిగించే విషయాలకు 'లైక్' బటన్ నొక్కడం ఇబ్బందిగా ఉందని వారు అంటున్నారని, ఈ సంస్కృతిని త్వరలోనే తొలగిస్తామని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News