: కాంగ్రెస్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం


అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'ను నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)ను కాంగ్రెస్ పార్టీ కోరింది. నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీని ఆయన కార్యాలయంలో కలసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఈ మేరకు విన్నవించారు. బీహార్ ఎన్నికలు ముగిసే వరకు ఆ కార్యక్రమం జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమం కొనసాగితే, మోదీ ప్రభావం ఓటర్ల మీద పడే ప్రమాదం ఉందని సీఈసీకి కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే, వీరి విన్నపాన్ని సీఈసీ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఐదు దశలలో జరగనున్న బీహార్ ఎన్నికలు అక్టోబర్ 12న మొదలై, నవంబర్ 5వ తేదీతో ముగుస్తాయి.

  • Loading...

More Telugu News