: '8333999999' నంబరు నుంచి ఫోన్ వస్తుంది... ఏ నేత కావాలో అడుగుతుంది!


తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే నేతను ఎన్నుకునేందుకు ఆ పార్టీ అధినేత ఐవీఆర్ఎస్ విధానాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా సెల్ ఫోన్లకు '8333999999' నంబరు నుంచి ఫోన్ వస్తుంది. "ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభినందనలు" అంటూ మొదలయ్యే సందేశం తరువాత తెలంగాణలో టీడీపీని ముందుకు తీసుకెళ్లగలిగే నాయకుడు ఎవరో చెప్పండని వినిపిస్తుంది. సెల్ ఫోన్లో 'బీప్' శబ్దం వినిపించిన తరువాత పేరు చెప్పమని అంటుంది. ఇలా తెలంగాణలో పార్టీ సారధి కోసం చంద్రబాబు సూచనల మేరకు ఆ పార్టీ వర్గాలు మొబైల్ సర్వేను ప్రారంభించారు. ఇక ఈ సర్వే అనంతరం అత్యధికులు ఎంచుకున్న వారికి పగ్గాలు అప్పగిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News