: నా విషయంలో ఢిల్లీ పోలీసులు మితిమీరిన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు: సోమ్ నాథ్ భారతి


భార్య లిపిక మిత్ర తనపై పెట్టిన కేసులో ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న సత్వర చర్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి ఆరోపణలు చేశారు. తన కేసు విషయంలో గాలి, శబ్దం కంటే వేగంగా దూసుకెళుతున్నారన్నారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి వారు మితిమీరిన అత్యుత్సాహంతో పనిచేస్తున్నారని, దాని వెనుక రాజకీయ కారణాలున్నాయని విమర్శించారు. ప్రతి కేసులోనూ ఇదే వేగంతో పనిచేస్తే ఢిల్లీ నేర రహిత మహానగరంగా అనతికాలంలోనే రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. సోమ్ నాథ్ తనను గృహహింసకు గురిచేస్తూ, హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడంటూ భార్య చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. తాజాగా ఆయనకు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News