: ఐఎస్ఐఎస్ వీడియోల ప్రేరణతో, కన్నతల్లి తల తెగ్గోసిన టీనేజర్ కు పడ్డ శిక్ష ఇదే!


యువతపై ఐఎస్ఐఎస్ ఎటువంటి ప్రభావం చూపుతుందో వెల్లడించే భయానక ఘటన ఇది. 15 సంవత్సరాల లీసా బోర్చ్ అనే డానిష్ టీనేజర్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బ్రిటన్ జాతీయుల తలలు తెగ్గోస్తున్న వీడియోలను చూసి, అదే విధంగా వంటగదిలోని చాకుతో తన తల్లి టీనా రోమర్ తలను నిర్దయగా తెగ్గోసింది. ఆపై పోలీసులకూ ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి తల్లి గురించి అడిగితే, కంప్యూటర్లో అవే వీడియోలు చూస్తూ, బెడ్ రూం వైపు దారి చూపించిందట. డెన్మార్క్ లో సంచలనం సృష్టించిన ఈ ఘటన గత సంవత్సరం అక్టోబరులో జరుగగా పోలీసులు అబ్దుల్లా, లీసాలను అరెస్ట్ చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం లీసాకు 9 సంవత్సరాలు, అబ్దుల్లాకు 13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. లీసా తన బాయ్ ఫ్రెండ్ అబ్దుల్లాతో కలసి సిరియాకు వెళ్లి ఐఎస్ఐఎస్ తరఫున యుద్ధం చేయాలని భావించినట్టు 'ది డైలీ మెయిల్' ఓ కథనాన్ని ప్రచురించింది.

  • Loading...

More Telugu News