: ఖతార్ ఎయిర్ వేస్ కు 12.84 లక్షల రూపాయల కుచ్చుటోపీ


ఖతార్ ఎయిర్ వేస్ కు 12.84 లక్షల రూపాయలకు ఓ ఘనుడు కుచ్చుటోపీ పెట్టాడు. హైదరాబాదు పాతబస్తీకి చెందిన సయ్యద్ మొజం అలీ బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 1లో ఉన్న ఖతార్ ఎయిర్ వేస్ సంస్థలో టికెట్ ఏజెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన గత ఆగస్టు 2 నుంచి 15లోపు కొంత మందికి ఆన్ లైన్ ద్వారా ఖతార్ ఎయిర్ వేస్ లో టికెట్లు బుక్ చేశాడు. వారికి టికెట్ బుకింగ్ కాపీలు కూడా అందజేసి, వారి నుంచి నగదు తీసుకున్నాడు. టికెట్ బుక్ అయిందన్న విశ్వాసంతో వారు వెళ్లిపోయారు. వారు వెళ్లగానే ఆ టికెట్లను ఆయన క్యాన్సిల్ చేసుకుని, ఆ నగదును తిరిగి తన ఖాతాలో జమ చేయించుకునేవాడు. ఆ తరువాత ఈ టికెట్లను మరొకరికి విక్రయించేవాడు. ఇలా విక్రయించేటప్పుడు టికెట్ ధరను సున్నాగా చూపి, ప్రాసెసింగ్ ఫీజును మాత్రమే చెల్లించేవాడు. ఇలా 12.84 లక్షల రూపాయలు స్వాహా చేసేశాడు. ఖతార్ ఎయిర్ వేస్ అంతర్గత ఆడిటింగ్ లో అతని లీలలు వెలుగు చూడడంతో సదరు సంస్థ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News