: అమరావతిని అడ్డుకునేందుకు జగన్ సింగపూర్ కు లేఖలు రాస్తున్నారు: నారా లోకేష్


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని టీడీపీ కార్యకర్తల నిధి సమన్వయకర్త నారా లోకేష్ ఆరోపించారు. హైదరాబాదులోని టీడీపీ భవన్ లో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జగన్ సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో ఆయన రాసిన లేఖలను సింగపూర్ ప్రభుత్వం చెత్తబుట్టలో పడేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే అది జగన్ కు కనబడడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై 95 శాతం మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పిన ఆయన, రుణమాఫీ అసాధ్యమన్న జగన్ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి టీడీపీ తప్పుకుంటే, తాను పొత్తుపెట్టుకుందామని జగన్ చూస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీయేలో టీడీపీ ఉండడం అనివార్యమని ఆయన తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న జగన్, అభివృద్ధికి అడ్డుపడుతూ ఉద్యోగాలు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News