: తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ...ఊరేగుతున్న విష్వక్సేనుడు


తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు మాడవీధుల్లో శ్రీవారి సర్వసేనాపతి విష్వక్సేనుడు ఊరేగారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పుట్టమన్ను సేకరించేందుకు వెళ్లారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ పటిష్ఠ ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. ప్రత్యేక బలగాలతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ఎంత మంది భక్తులు వచ్చినా స్వాగతించేందుకు టీటీడీ సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని నియమించినట్టు టీటీడీ తెలిపింది.

  • Loading...

More Telugu News