: చిలకలూరిపేటలో దారుణం... నడిరోడ్డుపై మహిళ హత్య!


గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడి రోడ్డుపై శామ్యూల్ అనే వ్యక్తి ఓ మహిళను వేటకొడవలితో అత్యంత పాశవికంగా నరికి చంపాడు. అనంతరం నేరుగా దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. స్థానిక బార్ లో పనిచేసే సదరు మహిళ భర్త మృతి చెందడంతో వేరొకరితో ఆమె కొన్నాళ్లు సహజీవనం చేసింది. ఈ క్రమంలో ఆమె కొన్నాళ్ల క్రితం మరోవ్యక్తి పట్ల ఆకర్షితురాలైంది. ఇటీవల అతనితో కూడా విడిపోయి హంతకుడి సోదరుడితో సహజీవనం చేసింది. ఈ క్రమంలో హంతకుడి సోదరుడు ఆటోనడుపుతూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. దీంతో, వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగానే తన సోదరుడ్ని ఆమె హత్య చేయించిందన్న అనుమానంతో, ఆమెను నరికి చంపినట్టు హంతకుడు పోలీసులకు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇదే కారణమా? లేక ఇంకేదన్నా కారణమా? అన్న కోణంలో విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News