: చెన్నైలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్


చెన్నైలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. నుంగంబక్కమ్ ప్రాంతంలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ వల్ల ఒకేసారి 249 కార్లు, 230 బైకులను పార్కింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ఈ సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చెన్నై కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంయుక్తంగా రూ.43 కోట్లు వెచ్చించాయి. దీంతో ఇకపై పార్కింగ్ సమస్యలకు ఆస్కారం ఉండదని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News