: ఇప్పుడు రెండో స్థానం...త్వరలోనే అగ్రస్థానం: లోకేష్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ కు రెండో ర్యాంకు వచ్చిందని టీడీపీ కార్యకర్తల నిధి సమన్వయ కర్త నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ కు రెండో ర్యాంకు కట్టబెట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్లో స్పందించిన ఆయన త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల అనుకూల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడంతో పెట్టుబడులు మరిన్ని వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేయించుకోవడం కంటే విజయవాడలో ఉంటూ పరిపాలన సాగించడమే ఉత్తమమని లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ పోరాటం చేస్తుందని నారా లోకేష్ స్పష్టం చేశారు.