: తనదైన శైలిలో జీవితాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న గేల్!
క్రికెట్ లో క్రిస్ గేల్ పేరు చెబితే చాలు, అతని ఆటతీరు గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు. టీట్వంటీ, వన్డే, టెస్టు ఇలా ఫార్మాట్ ఏదయినా వెస్టిండీస్ జట్టులో గేల్ ఉండాల్సిందే. విధ్వంసకరమైన ఆటతీరుతో కేవలం విండీస్ జట్టుకే కాకుండా ఐపీఎల్, బిగ్ బాష్, కౌంటీ వంటి ఇతర ఫార్మాట్లకు కూడా గేల్ విలువైన ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు. సాధారణంగా ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి వార్తల్లో నిలిచే గేల్, ఈ సారి తన లైఫ్ స్టైల్ గురించి ప్రపంచానికి తెలిపి వార్తల్లో నిలిచాడు. క్రికెట్ జీవితం గేల్ కు కీర్తినే కాకుండా బోలెడు డబ్బును కూడా ఇచ్చింది. దాంతో, గేల్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. భారీ ఎత్తున టోర్నీల్లో పాల్గొంటుండడానికి తోడు ఐపీఎల్ వంటి టోర్నీల్లో పాల్గోవడం వల్ల మోడల్స్ కూడా పరిచయమయ్యారు. అంతే, ఇంట్లోనే స్ట్రిప్ క్లబ్ ను ఏర్పాటు చేసుకున్నాడు గేల్. తనలా జీవితాన్ని ఏ ఆటగాడైనా ఎంజాయ్ చేయగలడా? అంటూ సహచరులకు సవాలు కూడా విసిరాడు. బ్యాచిలర్ గా జీవితాన్ని గడిపే గేల్, విచ్చలవిడి జీవితాన్ని అనుసరిస్తాడు. 'నీలా జీవించడం మావల్ల కాదు గురూ' అంటూ పలువురు ఆటగాళ్లు చేతులెత్తేశారు. గేల్ పోస్టు చేసే వీడియోలు అతని జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఒక్క ఫోటో విడుదల చేస్తేనే పరిస్థితి ఇలా ఉంది...తాను దిగిన ఇతర ఫోటోలు విడుదల చేస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని గేల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు!