: ఇంజినీర్ల కృషి వల్లే పట్టిసీమను 5 నెలల్లో పూర్తి చేయగలిగాం: చంద్రబాబు


విజయవాడలో జరిగిన ఇంజినీర్స్ డే వేడుకల్లో వారి ప్రతిభను, కృషిని సీఎం చంద్రబాబు కొనియాడారు. భారతదేశ ఇంజినీర్లలో మొదటిస్థానంలో ఉన్న వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నారు. ఇంజినీర్ల ప్రతిభ వల్లే పట్టిసీమ ప్రాజెక్టును అత్యంత తక్కువ కాలంలో పూర్తి చేశామని చెప్పారు. కేవలం 5 నెలల 15 రోజుల్లోనే పట్టిసీమను పూర్తి చేయగలిగామంటే ఇంజినీర్ల కృషి వల్లేనని సీఎం ప్రశంసించారు. యువత ఇంజినీరింగ్ పై ఆసక్తి పెంచుకోవాలని సరికొత్త ఆలోచనలతో దేశంలో కరవును తరిమికొట్టేలా ప్రాజెక్టులు నిర్మించాలని చంద్రబాబు కోరారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలోనూ ఇంజినీర్లు ప్రతిభ చూపించి ప్రపంచంలోనే అద్భుత నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కాగా పోలవరం పూర్తి చేయాలంటే నాలుగైదేళ్లు పడుతుందని, అందుకే ముందుగా పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News