: ప్రపంచబ్యాంక్ జాబితాలో తెలంగాణ ర్యాంకుపై కేటీఆర్ అసంతృప్తి


ప్రపంచబ్యాంకు తెలంగాణ రాష్ట్రానికి 13వ ర్యాంకు ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలీ రాష్ట్రాల జాబితాను ఏ ప్రాతిపదికన రూపొందించారన్న విషయం తనకు తెలియదన్నారు. వాటిని తాము పట్టించుకోమని, తమకు ర్యాంకులతో పనిలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన పనిని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని ఒకరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి దక్కిన ర్యాంకుపై పెదవి విరిచారు. దానిపై పలు సందేహాలున్నాయని, అసలు ఏ ప్రాతిపదికన తెలంగాణకు 13 ర్యాంక్ ఇచ్చారని అడిగారు. ర్యాంకింగ్స్ లో ఏన్డీఏ పాలిత రాష్ట్రాలే ముందున్నాయని విమర్శించారు. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రాల జాబితాను తాజాగా ప్రపంచబ్యాంకు విడుదల చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News