: ఓ ఛానెల్ ఎండీని కిడ్నాప్ చేయబోయి బాలుడ్ని కిడ్నాప్ చేశారు


కొన్నిసార్లు ఏదయినా సినిమా చూడాలని ఫిక్స్ అయి థియేటర్ కు వెళ్తే...టికెట్లు ఉండవు. అలాంటప్పుడు 'ఏదో ఒక సినిమా చూసేద్దాం' అని ఏదో ఒక థియేటర్లో దూరి సినిమా చూశామనిపించి ఇంటికి వచ్చేస్తాం. హైదరాబాదులో ఎల్బీ నగర్ లో కిడ్నాపర్ లకు కూడా అలాగే అనిపించిందేమో, ఒకర్ని కిడ్నాప్ చేయడానికి వెళ్లి ఇంకొకర్ని కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళ్తే...హైదరాబాదులోని ఓ టీవీ ఛానెల్ ఎండీ స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి, భారీగా డబ్బు వసూలు చేయాలని భావించిన కొందరు వ్యక్తులు, కిడ్నాప్ చేసేందుకు పథకం రచించారు. పథకం విఫలం కావడంతో, చివరికి ఓ బాలుడ్ని కిడ్నాప్ చేశారు. అపహరణ సమయంలో కిడ్నాపర్ జేబులోంచి సెల్ ఫోన్ కిందపడింది. దీంతో దొరికిపోతామని భావించిన కిడ్నాపర్లు బాలుడ్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టారు. బాలుడి అపహరణపై కేసు నమోదు చేసిన పోలీసులు, కేసును ఛేదించి, కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News