: నెటిజన్లను ఆకట్టుకుంటున్న పోలీసు సాహసం
పోలీసుల వ్యవహార శైలిపై ఎన్ని విమర్శలున్నా...విధులు నిర్వర్తించడంలో తమకుతామే సాటి అని కొంత మంది పోలీసు అధికారులు నిరూపిస్తున్నారు. అలాంటి ఉదంతమే మహారాష్ట్రలోని నాసిక్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ కుంభమేళా జరుగుతోంది. ఈ వేడుకలకు భక్తులు పోటెత్తడంతో పోలీసులు పటిష్ఠ గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళాకు వచ్చిన ఓ భక్తుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన ఓ పోలీసు అధికారి ప్రాణాలకు తెగించి, నదిలో దూకి ఆ భక్తుడిని కాపాడారు. ఈ ఘటన స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కింది. దీనిని ఓ పోలీసు ఉన్నతాధికారి సోషల్ మీడియాలో పెట్టారు. కాసేపటికే ఇది వైరల్ లా షేర్ అవుతోంది. 'పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన' అని అందులో ఆ అధికారి పేర్కొన్నారు.