: అదృష్టం అంటే రుబీనా అలీదే!


'స్లమ్ డాగ్ మిలియనీర్'లో చిన్న ఫ్రీదా పింటోగా నటించిన రుబీనా అలీకి జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు క్యూకట్టాయి. ముంబైలోని గరీబ్ నగర్ స్లమ్ లోని ఓ పూరింట్లో నివసించే రుబీనా అలీ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిబూడిదైపోయింది. దీంతో రుబీనా కుటుంబానికి ఎక్కడ ఉండాలో తెలియలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బాంద్రాలోని ఓ చిన్న ఇంట్లో అద్దెకు దిగింది. ఇంతలో 'స్లమ్ డాగ్ మిలియనీర్' దర్శకుడు డానీ బోయెల్ 'జైహో' పేరిట ఓ ట్రస్టు ప్రారంభించాడు. రుబీనాను చదివిస్తానని ఆ సినిమా నిర్మాణం సమయంలో మాటిచ్చిన బోయెల్, ప్రస్తుతం ఆమెకో ఇల్లు అవసరమని భావించాడు. దీంతో తన సిబ్బందిని రుబీనా కుటుంబానికి ఇల్లు చూడమని ఆదేశించాడు. వారు సచిన్, సల్మాన్, షారూఖ్ వంటి వారు నివాసముండే బాంద్రా ప్రాంతంలో ఓ సింగిల్ బెడ్రూం ఫ్లాట్ చూసి, 45 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. దీంతో త్వరలోనే ఆ ఇంట్లోకి రుబీనా అడుగుపెట్టనుంది. కొత్త ఇంట్లోకి వెళ్తున్నానని మురిసిపోతోంది. చిన్నప్పుడు సొంతిల్లు ఉంటే బాగుండును అని కల కనేదానినని, బోయెల్ సర్ వల్ల తన కల నిజమవుతోందని రుబీనా చెబుతోంది. ప్రస్తుతం రుబీనా 'లార్డ్ ఒవెన్స్ లేడీ' అనే సినిమాలో నటిస్తోంది.

  • Loading...

More Telugu News