: మెటల్, ఫైనాన్స్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడం, మెటల్, ఫైనాన్స్ సంబంధిత స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరగడం వంటి అంశాలతో ఈనాటి మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 25,705కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు పతనమై 7,829కి చేరింది. ఈనాటి టాప్ గెయినర్స్ లో మణప్పురం ఫైనాన్స్ (7.73), గోద్రెజ్ ప్రాపర్టీస్ (6.75), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (5.75), అలోక్ ఇండస్ట్రీస్ (5.23), డెల్టా కార్ప్ (5.16) ఉన్నాయి. టాస్ లూజర్స్ గా భారత్ ఫోర్జ్ (-5.98), రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (-5.35), టాటా స్టీల్ (-5.08), సన్ రైజ్ ఏషియన్ (-4.94), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-4.81) నిలిచాయి.