: షాక్ కొట్టిన వినాయక మంటపం... ఇద్దరు దుర్మరణం
కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. వినాయక మంటపం వద్ద విద్యుత్ షాక్ కొట్టడంతో నిమ్మల నరేష్, పరశురాములు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలోని కొందరు యువకులు ఈ మధ్యాహ్నం మంటపం ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిద్దరూ బావ, బావమరిది అని సమాచారం.