: భూసేకరణ కోసం ఎవరొచ్చినా చీపుర్లతో తరిమికొట్టండి: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్ చేశాయి. భోగాపురంలో ఈ రోజు పది వామపక్షాలు నిర్వహించిన బహిరంగసభలో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, భూసేకరణ విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ భూసేకరణ కోసం మంత్రులు, అధికారులు ఎవరు వచ్చినా చీపుర్లతో తరిమికొట్టాలని రైతులకు, ప్రజలకు సూచించారు. అసెంబ్లీ, రాష్ట్ర బంద్ కు భోగాపురం మండల ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.