: సీఎల్పీ భేటీ నుంచి అలిగి వెళ్లిపోయిన పొంగులేటి
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జానారెడ్డి అధ్యక్షతన ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా మరికొద్ది రోజుల్లో జరగనున్న శాసనసభ సమావేశాలను రైతుల సమస్యలపై స్తంభింపజేయాలని నిర్ణయించారు. రైతుల ఆత్మహత్యలపై తమ డిమాండ్లు నెరవేరేంత వరకు సమావేశాలను అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, పోలవరం ముంపు మండలాల సమస్యను ప్రస్తావించారు. అయితే ఆయన సమస్యను పట్టించుకోకపోవడంతో సమావేశం నుంచి ఆయన అలిగి వెళ్లిపోయారు.