: భారత-పాక్ సిరీస్ కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది: జహీర్ అబ్బాస్


భారత్-పాక్ సిరీస్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందని పాక్ మాజీ క్రికెటర్, ఐసీసీ చీఫ్ జహీర్ అబ్బాస్ తెలిపారు. హైదరాబాదు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత హైదరాబాదు వచ్చానని అన్నారు. ప్రపంచ దేశాల్లో క్రికెట్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ఐసీసీ విశేషమైన కృషి చేస్తోందని ఆయన చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు హైదరాబాదులో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. భారత్-పాక్ లు క్రికెట్ ఆడాలని తాము అభిలషిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, సరిహద్దుల్లో నిత్యం అల్లకల్లోలం సృష్టిస్తూ, ఆడతామంటున్న పాకిస్థాన్ తో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ సముఖత వ్యక్తం చేయడం లేదు.

  • Loading...

More Telugu News