: నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు: ఎమ్మెల్యే కూతురు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే నాని కూతురు ప్రేమ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. తన కూతురును సందీప్ అనే అతడు కిడ్నాప్ చేశాడని ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు సందీప్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గుంటూరు లీగల్ సర్వీసెస్ అథారిటీని ఈ రోజు ఆశ్రయించిన ఎమ్మెల్యే కూతురు రమ్య తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన తండ్రే సందీప్ ను కలవకుండా నాలుగేళ్లుగా తనను గృహ నిర్బంధంలో ఉంచాడని ఆమె ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని కోరింది. అలాగే, తన భర్త సందీప్ ను పోలీసుల బారి నుంచి విడిపించాలని అభ్యర్థించింది. చిలకలూరిపేటకు చెందిన సందీప్ ను 2008లో రమ్య పెళ్లాడింది.