: చంద్రబాబు కృషితోనే పెట్టుబడులకు రెండో స్థానంలో ఏపీ నిలిచింది: సోమిరెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే పెట్టుబడులకు రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ హయాంలో అవినీతిలో రాష్ట్రానికి మూడో స్థానం వస్తే చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో రెండోస్థానం లభించడం అభినందనీయమన్నారు. వైఎస్ హయాంలో రాష్ట్రానికి పర్యాటకులు కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్ లూటీ చేసిన అక్రమ ఆస్తులను ప్రజలకు పంచితే రాష్ట్రం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.