: శంషాబాద్ విమానాశ్రయంలో సానియాకు ఘనస్వాగతం
టెన్నిస్ స్టార్, యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జా ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. సానియా తల్లిదండ్రులు, అభిమానులు ఆమెకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. సానియా మీడియాతో మాట్లాడుతూ, డబుల్స్ టైటిల్ సాధించడంతో తనకెంతో ఆనందంగా ఉందని, గ్రాండ్ స్లామ్ లో ప్రత్యర్థులకు తాను, హింగిస్ గట్టిపోటీ యిచ్చామని అన్నారు. ఈ విజయాన్ని దేశానికి అంకితం చేస్తున్నట్లు సానియా చెప్పారు. ముఖ్యంగా తన కుటుంబసభ్యులు, క్రీడాభిమానులు చూపించిన ప్రోత్సాహం వల్లే గ్రాండ్ స్లామ్ విజయం దక్కిందని చెప్పింది.