: నారా లోకేష్ కు ప్రమోషన్?
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు ప్రమోషన్ దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే లోకేష్ కు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీలోని పలువురు సీనియర్ నేతలు లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకటరావును నియమించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.