: ఆ పని చేస్తే కారు దిగి మరీ సలహాలిస్తా: అమితాబ్
తాను ఎప్పుడైనా బయట తిరుగుతూ, ట్రాఫిక్ నిబంధనలు మీరుతున్న వారిని చూస్తే, కారు దిగి మరీ వారికి క్లాస్ పీకుతానని, అయితే, వారు నొచ్చుకునేలా కాకుండా, సలహాలు మాత్రమే ఇస్తానని బిగ్ బీ అమితాబ్ తెలిపారు. ఈ ఉదయం ముంబై పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమితాబ్ మాట్లాడుతూ, తాను ఏ దేశానికి వెళ్లినా అక్కడి ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు ఎలా పాటిస్తున్నారన్న విషయాన్ని నిశితంగా గమనిస్తానని తెలిపారు. నిబంధనలు పాటిస్తున్న వారిని చూస్తే, గౌరవం పెరుగుతుందని, ఇండియాకు వచ్చే విదేశీయులకు అలాంటి గౌరవమే కలిగేలా భారతీయులు ప్రవర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులకు ఆయన హెల్మెట్లను పంచారు.