: విద్యార్థి సంఘాల నేతలను పేరు పేరునా పలకరించిన జగన్... కేరింతలు కొట్టిన ఎస్వీ వర్శిటీ యువత
ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా, తిరుపతిలో ప్రారంభమైన యువభేరి సదస్సులో వైకాపా అధినేత వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించిన తీరు విద్యార్థినీ విద్యార్థులను కేరింతలు కొట్టించింది. అంతకుముందు ప్రసంగించిన విద్యార్థి సంఘాల నేతలను పేరు పేరునా ఆయన ప్రస్తావించారు. ఒక్కో పేరు పిలుస్తుంటే, ఎస్వీ వర్శిటీ యువత చప్పట్లతో స్వాగతించారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగిస్తూ, గతంలో టీడీఎల్ పీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం పెట్టిన ఈ ప్రాంతంలోనే ఆయనకు వ్యతిరేకత వెల్లువెత్తుతోందని అన్నారు. భారీ సంఖ్యలో హాజరైన యువత, తమకు హోదాతోనే న్యాయం జరుగుతోందని నమ్ముతున్నారని జగన్ అన్నారు. రేపు ఈ పిల్లలే పెద్దలకు బుద్ధి చెబుతారని, ప్రతిష్ఠాత్మక శ్రీవెంకటేశ్వరా యూనివర్శిటీ నుంచే ఇది మొదలవుతుందన్న నమ్మకం తనకుందని ఆయన అన్నారు.