: కళ్లు మూసుకుంటే చాలు, పోప్ కు మొద్దు నిద్ర వస్తుందట!
ఇటీవల రేడియో చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోప్ ఫ్రాన్సిస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మీకో నిజం చెప్పాలనుకుంటున్నానని, తనకసలు నిద్రలేమి సమస్య లేదని చెప్పారు. ఎందుకంటే, తానో మొద్దులా నిద్రపోతానని చెప్పి పోప్ ఆశ్చర్యపరిచారు. అలాగైతే మీరు తొందరగా లేవాలంటే ఏం చేస్తారని ప్రశ్నించగా, ఒకవేళ తనకు చాలా పనుందనుకుంటే మాత్రం వెంటనే మేల్కొంటానని వివరించారు. అయితే దేవుడు ఆదేశించినప్పుడు మాత్రం అది ఏ ప్రాంతంమైనా తాను శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయేందుకు సంతోషపడతానని పోప్ తెలిపారు.