: విశాఖ నుంచి ఆదిలాబాద్ వరకు యువకుడి పాదయాత్ర


పాదయాత్రలు... ప్రజలను చైతన్య పరిచాయి, నేతలకు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రభుత్వాలనూ కూల్చాయి. అంటే లక్ష్యాన్ని సాధించాయన్నమాట. అందుకే పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకున్నాడా యువకుడు. స్వలాభం కోసం కాదు..అందరి కోసం. దేశంలో పిల్లలందరికీ నాణ్యతతో కూడిన విద్య అందించాలని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఈ పాదయాత్రను చేస్తున్నాడు. ఆ కథేంటంటే.. విశాఖ జిల్లాకు చెందిన కెఎల్ సతీష్ వర్మ అనే యువకుడు ... విశాఖపట్టణం జిల్లాలోని అల్లూరి గ్రామంలో స్వాతంత్ర్య పోరాటయోధుడు, మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు సమాధి నుంచి పాదయాత్రను ప్రారంభించాడు. ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ వరకు అంటే 1100 కిలో మీటర్ల నడకతో ఈ పాదయాత్ర ముగుస్తుంది. సోమవారం నాడు ఆయన భ్రదాచలం చేరుకున్నాడు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్య, ప్రజలకు మౌలికవసతుల కల్పన..ఈ రెండింటి గురించి ప్రజలను చైతన్య పరచాలన్న లక్ష్యంతోనే ఈ పాదయాత్ర చేస్తున్నానన్నాడు.

  • Loading...

More Telugu News