: 'బాహుబలి' గణపతి అదరహో!
గణనాథుడికి ఎన్ని రూపాలో! తనను ఏ రూపంలో మలిచి పూజలు చేసినా ఆయనకు సంతోషమే. అందుకే కాబోలు... హైదరాబాద్ లోని కాచిగూడ భక్తులు బాహుబలి గణపతిని తయారు చేశారు. బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ తన భుజంపై శివలింగాన్ని మోసుకుపోయే దృశ్యం ఒకటి ఉంటుంది. అదే పోజులో వినాయకుడు తన తండ్రిని శివలింగరూపంలో భుజంపై మోసుకువెళ్తున్నట్లుగా విగ్రహాన్ని తయారు చేశారు. అది కూడా పర్యావరణ స్నేహపూర్వక మట్టి వినాయక విగ్రహం!ఈ విగ్రహం భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.