: జగన్ కూడా సూదిగాడే: దేవినేని ఉమా


వైకాపా అధినేత జగన్ ను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 'సూదిగాడు'తో పోల్చారు. సూదిగాళ్ల వల్ల రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారని... జగన్ కూడా సూదిగాడిలానే తయారయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ ఎక్కడ, ఎప్పుడు, ఎవరిని గుచ్చుతాడో కూడా అర్థం కావడం లేదని అన్నారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని వ్యాఖ్యానించారు. గండేపల్లి రోడ్డు ప్రమాద బాధితులను స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు, రెవెన్యూ అధికారులు వెంటనే పరామర్శించారని... అయితే, ఇలాంటివేవీ జగన్ కంటికి కనిపించవని మండిపడ్డారు. మాట్లాడితే, కుర్చీ దిగండని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని జగన్ కు సూచించారు.

  • Loading...

More Telugu News