: నాజూగ్గా లేరంటూ, 125 మంది ఎయిర్ హోస్టెస్ లను తొలగించిన ఎయిర్ ఇండియా


శరీర బరువు తగ్గించుకుని నాజూగ్గా మారేందుకు ఏడాదిన్నర సమయమిచ్చినా, మారలేదని ఆరోపిస్తూ, 125 మంది ఎయిర్ హోస్టెస్ లను తొలగిస్తున్నట్టు ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న 600 మంది సిబ్బంది స్థూలకాయులుగా ఉండగా, వీరందరికీ, ఒళ్లు తగ్గించుకోవాలని సంస్థ చాలా నెలల క్రితమే తాఖీదులు పంపింది. ఈ విషయంలో స్పందించని వారిని తొలగించినట్టు తెలిపింది. కాగా, ఎయిర్ హోస్టెస్ ల విషయంలో ఎయిర్ లైన్స్ సంస్థలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులకు ఆకర్షణీయంగా కనిపించేలా, అందం, చక్కటి శరీరాకృతి, మంచి ఎత్తు, సరైన పళ్ల వరస వీరికి సొంతమై వుండాలి. విధుల్లో చేరే సమయంలో వీరు అందంగానే వుంటారు. ఆపై వీరు మారిపోతున్నారన్నది ఎయిర్ లైన్స్ యాజమాన్యాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. నియమిత బరువు కన్నా ఎక్కువ పెరిగితే, వీరిని విధుల నుంచి తొలగించేలా ముందే కాంట్రాక్టులు రాయించుకుంటారు. దీంతో ఎయిర్ హోస్టెస్ లు తమ ఆకృతిని కాపాడుకునేందుకు నానా తంటాలూ పడక తప్పని పరిస్థితి.

  • Loading...

More Telugu News