: పేపర్లు అమ్ముకోవడానికి వాళ్లకి నేను సాయపడుతున్నా: సానియా మీర్జా


మార్టినా హింగిస్ తో కలసి యూఎస్ ఓపెన్ ను గెలుచుకున్న ఆనందంలో ఉన్న సానియా, తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చింది. తనను విమర్శించే వాళ్లు ఏం అంటారన్న విషయం తనకు అవసరం లేదని, తాను కేవలం ఆటపై మాత్రమే దృష్టిని సారిస్తానని స్పష్టం చేసింది. "నాకు తెలుసు. వాళ్ల దినపత్రికలు అమ్ముకోవడానికి, టీఆర్పీ రేటింగులు పెరగడానికి, నా కెరీర్ ఆసాతం నేను సహకరిస్తూనే ఉన్నాను. విషయం లేకుండానే నాకు పబ్లిసిటీ ఇస్తూ, ప్రజలకు దగ్గరగా ఉంచిన వారందరికీ కృతజ్ఞతలు. నేను టెన్నిస్ మాత్రమే ఆడతాను. గెలవడానికి ప్రయత్నిస్తాను. నాకోసం, నా దేశం కోసం ఆడతాను. నాపై విమర్శలకు కేవలం రాకెట్ తోనే సమాధానం ఇస్తా. అదే నాకు ఇష్టం" అని అన్నారు. కాగా, సానియాకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డును బహూకరించడంపై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News