: రాత్రి పూట మేమూ అవే చూస్తాం!: విద్యార్థులతో మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు


తన స్థాయిని, హోదాను మరిచిన మహారాష్ట్ర ఆహార శాఖా మంత్రి గిరీష్ బపత్, విద్యార్థుల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అశ్లీలాన్ని ప్రోత్సహించేలా వున్నాయని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూణెలోని ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన, "రాత్రుళ్లు మీరు మొబైల్ ఫోన్లలో ఎలాంటి క్లిప్పింగ్స్ చూస్తారో మేం కూడా అవే చూస్తాం. మాకు వయసైపోయిందని ఎలా అనుకుంటారు? మా మనసుకు సంబంధించినంత వరకూ మేము ఇంకా యువకులమే" అని అన్నారు. గిరీష్ వ్యాఖ్యలపై ఓ న్యాయ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News