: ఇంత వర్షం పడుతున్నా సగం ప్రాంతాల్లో కరవే!
రైతన్నలు ఎన్నో ఆశలు పెట్టుకున్న నైరుతీ రుతుపవనాలు ఆశించిన స్థాయిలో వర్షాలను తీసుకురాలేదని, దీంతో దేశంలో సగం పొలాలు కరవులోనే ఉన్నాయని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఈ సీజనులో 50 శాతం భూభాగంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని, 44 శాతం మేరకు భూమిపై చాలినంత వర్షాలు పడకపోగా, మిగతా ప్రాంతంలో భారీ వర్షాలు పడ్డాయని తెలిపింది. యూపీలో 44 శాతం, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో 40 శాతం, పంజాబ్ లో 41 శాతం వర్షపాత లోటు నమోదైందని పేర్కొంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా లోటు 22 శాతానికి తగ్గిందని తెలిపింది.