: ఆ సినిమా చూశాడు, ఫెడెక్స్ కు 'సినిమా' చూపించాడు!


తెల్లారితే, స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తో యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్. మామూలుగా ఎవరైనా ఆటగాడైతే ఆ రాత్రి ఏం చేసుండేవాడు? మిగతావారి సంగతేమో కానీ, జకోవిచ్ గెరాల్డ్ బట్లర్ నటించిన హాలీవుడ్ చిత్రం '300' చూశాడట. ఆ చిత్రంలో హీరో వీరోచిత పోరాటం తనకెంతో స్ఫూర్తిని ఇచ్చిందని, అందువల్లే తాను ఫెదరర్ పై విజయం సాధించానని జకోవిచ్ స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం యూఎస్ ఓపెన్ గెలిచిన ఆనందంలో కుటుంబ సభ్యులతో కలసి సంబరాలు చేసుకుంటున్నాడు. ఏదైతేనేం... '300' సినిమా చూసిన జకోవిచ్, మైదానంలో ఫెడెక్స్ కు 'సినిమా' చూపించేశాడు.

  • Loading...

More Telugu News