: హీరోయిన్లుగా రాణించే అర్హతలు తెలుగమ్మాయిల్లో పుష్కలంగా వున్నాయి!: తెలంగాణ తొలి మిస్ సౌత్ ఇండియా
తెలుగు సినిమాల కోసం ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి హీరోయిన్ లను తీసుకురావాల్సిన అవసరం లేదని, తెలుగు అమ్మాయిలు అందంతో పాటు, నటీమణులుగా రాణించేందుకు కావాల్సిన అన్ని రకాల అర్హతలతో సిద్ధంగా ఉన్నారని తెలంగాణ తొలి మిస్ సౌత్ ఇండియా రష్మీ ఠాకూర్ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన మిస్ సౌత్ ఇండియా ప్రిలిమినరీ పోటీల్లో విజయం సాధించడం తనకు ఎంతో గర్వంగా ఉందని వెల్లడించిన ఆమె, మోడలింగ్ రంగంపై అనేక అపోహలు ఉన్నాయని, ఇది గ్లామర్ ఫీల్డ్ కావడంతోనే ఎక్కువ చర్చ, రచ్చ జరుగుతోందని అన్నారు. తమ పిల్లల అభిరుచుల మేరకు తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్ర రాజధానిలో ఎన్నో మోడలింగ్ సంస్థలు ఉన్నందున, తాను కరీంనగర్, వరంగల్ నగరాల్లో మోడలింగ్ శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నట్టు వివరించారు.