: వారిని చంపేస్తామంటూ అమెరికాను హెచ్చరించిన ఐఎస్ఐఎస్


వంద మంది అమెరికా సైన్యాధికారులను చంపేస్తామని ఐఎస్ఐఎస్ మరోసారి ఆ దేశానికి హెచ్చరికలు చేసింది. అల్ ఖైదా చేసిన సెప్టెంబర్ 11 దాడులకు శుభాకాంక్షలు చెప్పిన ఐఎస్ఐఎస్, తాము చంపబోయే అమెరికా సైనికాధికారుల ఫోటోలు, వివరాలు విడుదల చేసింది. గతంలో కొంత మంది ఫోటోలు విడుదల చేసిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఈసారి మరో వంద మంది ఫోటోలు, వివరాలు విడుదల చేయడం విశేషం. 'నేడు హ్యాక్ చేశాం, రేపు చంపేస్తాం' అంటూ ట్వీట్ చేశారు. అల్ ఖైదా నేత అల్ జవహరి పేరిట విడుదల చేసిన ఈ ఆడియో టేపులో, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో విభేదాలు ఉన్న సంగతి వాస్తవమేనని అంగీకరించి, ఈ విభేదాలు అమెరికాపై కలిసి దాడులు చేసేందుకు అడ్డం కాదని తెలిపారు. కాగా, తాజా ఆడియో టేపులపై ఆమెరికా ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News