: 'బ్రూస్ లీ' విడుదల తేదీని ధ్రువీకరించిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'బ్రూస్ లీ' సినిమా అక్టోబర్ 16న విడుదల కానుందని రామ్ చరణ్ తెలిపాడు. దసరా కానుకగా 'బ్రూస్ లీ'ని అభిమానుల మందుకు తీసుకురానున్నామని రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. ఫైట్ మాస్టర్ గా అభిమానులను అలరిస్తానని రామ్ చరణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, 'బ్రూస్ లీ' సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 26న జరుగనున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ పోస్టుతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీత దర్శకుడు. కాగా, రాంచరణ్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, చిరంజీవి ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. చిరు ఓ పాటకు స్టెప్పులు వేయనున్నట్టు సమాచారం. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ అభిమానులకు ఇది డబుల్ కిక్ లభిస్తుందనడంలో సందేహం లేదు.