: సమాజంలో హింసకు పురుషులే కారణం: మేనకా గాంధీ
సమాజంలో హింసకు పురుషులే కారణమంటూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లింగ సమానత్వంలో పురుషుల పాత్ర మరింత పెరగాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఆమె లైవ్ చాట్ చేశారు. లింగ వివక్ష లేకుండా చేసేందుకు పాఠశాల స్థాయి నుంచే చర్యలు తీసుకోవాలని మంత్రి మేనక సూచించారు. ఇందులో భాగంగా కొద్ది నెలల క్రితం తాము చేపట్టిన ‘జెండర్ చాంపియన్స్’ కార్యక్రమం గురించి కూడా ఆమె ప్రస్తావించారు. బాలికల పట్ల గౌరవంతో ఉండి, వారికి సాయపడే బాలురను ఎంపిక చేసి అవార్డులు ఇస్తామని మేనక ఆ చాట్ లో అన్నారు.