: భారత్ లో కారు ప్రయాణికులకు భద్రత...ఇకపై కారులో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి!


భవిష్యత్ లో భారత్ లో జరిగే కారు ప్రమాదాల్లో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే ఘటనలు అరుదుగా సంభవించనున్నాయి. మన దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చొప్పున రోడ్డు ప్రమాదాల కారణంగా బలవుతున్నారు. సాధారణంగా రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నవారు బతికి బట్టకట్టడం అరుదుగా జరుగుతోంది. దీనికి కారణాలు అన్వేషించిన అధికారులు, మెజారిటీ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడంతోనే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని నిర్ధారించారు. భారత్ లో కొనుగోలు చేస్తున్న కార్లలో మూడో వంతులో మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి. దీనికి కారణం ఎయిర్ బ్యాగ్స్ లేని కార్ల ధరలు ఎగువ మధ్యతరగతికి అనుకూలంగా ఉండడమే. దీనిపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం కార్ల తయారీ సంస్థలకు పలు ప్రమాణాలు సూచించనుంది. ప్రతి కారులోనూ విధిగా ఎయిర్ బ్యాగ్స్ ఉండాలనే నిబంధనను అమలు చేయనుంది. ఈ నిబంధనను అమలు చేస్తే కారు ప్రమాదాలు సంభవించినా కార్లో ఉన్నవారు క్షేమంగా బయటపడవచ్చు. దీంతో, భవిష్యత్ లో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్ లో తయారయ్యే కార్లలో ఎయిర్ బ్యాగ్స్ అమర్చేందుకు అవసరమైన కంపెనీలను, పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనుంది. దీంతో, భారత్ లో కంపెనీలు పెట్టేందుకు ఎయిర్ బ్యాగ్స్ తయారీ సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయి. ఆటోలివ్, టకాటా, టయోడా కంపెనీలు భారత్ లో ఎయిర్ బ్యాగ్స్ తయారీ యూనిట్లు పెట్టే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News