: భారత్ లో పెట్టుబడా?... అయితే, గుజరాత్, ఏపీలే బెస్టు: ప్రపంచ బ్యాంక్
భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల రాష్ట్రాల జాబితాను ర్యాంకుల పరంగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానం ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కాగా, రెండో స్థానంలో ప్రపంచ దేశాల పెట్టుబడులను ఆహ్వానిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. మూడో స్థానాన్ని జార్ఖండ్ రాష్ట్రం సంపాదించుకుంది. తెలంగాణ రాష్ట్రం 13వ స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన జాబితా అంతర్జాతీయ వ్యాపార వేత్తలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తాజా ర్యాంకింగ్స్ ఆధారంగా మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ ఏపీలో పెట్టుబడులపై మరిన్ని ఆశలు రేపింది.