: బుల్లితెరకు సైనా నెహ్వాల్... హిందీ సీరియల్ లో నటిస్తున్న బ్యాడ్మింటన్ స్టార్
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇప్పుడు నటనవైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓ హిందీ టీవీ సీరియల్ లో నటిస్తోంది. 'హర్ ఘర్ కుచ్ కథా హై' అనే సీరియల్ లో నటిస్తోంది. సీరియల్ లో ఆమెతో పాటు బాలీవుడ్ హాస్య నటుడు వినయ్ పాఠక్ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని సైనా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. షూటింగ్ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను కూడా ట్విట్టర్ లో పోస్టు చేసింది. త్వరలోనే ఈ సీరియల్ బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు రానుంది.