: మారిపోయాం, ఉరిశిక్ష వద్దు... 209 మందిని బలిగొన్న కిరాతకుల అభ్యర్థన!
దాదాపు 9 సంవత్సరాల క్రితం, జూలై 11, 2006 నాడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి 209 మంది ప్రాణాలను బలిగొని, 700 మందికి గాయాలు కావడానికి కారణమైన దోషులు, తమకు తక్కువ శిక్షను విధించాలని న్యాయమూర్తి ఎదుట ప్రాధేయపడ్డారు. తాము ఎంతో కాలం నుంచి జైల్లో ఉన్నామని, జైలు జీవితంతో మారిపోయామని వారు వేడుకున్నారు. ఇకపై తమ వల్ల సమాజానికి ఎలాంటి ముప్పూ రాదని, తామిక సత్ప్రవర్తనతో మెలగుతామని తెలిపారు. ఉరిశిక్ష విధించవద్దని కోరారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులు కాగా, 12 మంది దోషులేనని కోర్టు ఇటీవల తేల్చిన సంగతి తెలిసిందే. వీరందరికీ ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్ వాదించగా, దోషుల తరపున వారి న్యాయవాది తన చివరి వాదన వినిపించారు. కేసులో తీర్పు వెలువడాల్సి వుంది.