: విజయవాడ మెట్రోకు 'అమరావతి మెట్రో'గా నామకరణం

ఏపీ ప్రభుత్వం విజయవాడ మెట్రో రైలుకు పేరు నిర్ణయించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరుపై 'అమరావతి మెట్రో'గా దీనికి నామకరణం చేసింది. మెట్రో రైలు ఎండీగా రిటైర్డ్ అధికారి ఎస్.పి. రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన రవాణాశాఖ అడిషనల్ సెక్రటరీగా పనిచేశారు.