: కావాలనే జగన్ సమావేశాన్ని రద్దు చేయించారు: వంగవీటి రాధా


తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమావేశానికి అనుమతి రద్దు చేయడంపై ఆ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ ఆరోపణలు చేశారు. సమావేశాన్ని కావాలనే చంద్రబాబు రద్దు చేయించారన్నారు. ప్రత్యేక హోదాతో కలిగే లాభాలను విద్యార్థులు, యువతకు తెలియజేయాలన్నదే జగన్ ఉద్దేశమని పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళతామని హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. అసలు హోదాపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని రాధా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని అడుగుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News