: తల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించనున్న చైనా


రానున్న రెండేళ్లలో తల మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించనున్నామని చైనా వైద్య బృందం ప్రకటించింది. జన్యుపరమైన లోపాలవల్ల శరీరంలో తల మినహా మిగిలిన అవయవాలు పనిచేయని వారి తలను మార్చడంపై ఈ టీమ్ పరిశోధనలు నిర్వహించింది. తొలుత జంతువులపై వీరు పరిశోధనలు చేశారు. ఈ ప్రయోగాలు సఫలం కావడంతో... ఇప్పుడు ఇదే ప్రయత్నాన్ని మానవులపై కూడా నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. చైనా వైద్య బృందం చేస్తున్న ఈ ప్రయోగాల గురించి రష్యన్ శాస్త్రవేత్త వాలెరి స్పిరిడొనోవ్ కు తెలిసింది. వాలెరి స్పిరిడోవ్ కూడా అరుదైన జన్యు కండరాల వ్యాధి 'వెర్డింగ్ హాఫ్ మన్'తో బాధపడుతున్నారు. ఈ వ్యాధివల్ల అతని తల మినహా మిగిలిన శరీరం సరిగా ఎదగలేదు. దీంతో, చైనా వైద్య బృందం చేయబోతున్న శస్త్రచికిత్స కోసం హాఫ్ మన్ ముందుకొచ్చారు. 2017లో జరిపే శస్త్రచికిత్స ద్వారా వాలెరి తలను వేరుచేసి ఇతర దేహానికి అమరుస్తామని డాక్టర్ సెర్జియో తెలిపారు.

  • Loading...

More Telugu News