: పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 95 ఏళ్ల వృద్ధుడు!


వయస్సులో సెంచరీ కొట్టడానికి ఆయన ఐదేళ్ల దూరంలో ఉన్నారు. కానీ, ఉత్సాహం, పట్టుదల విషయంలో మాత్రం ఆయన కుర్రాడు. ఎందుకంటే, 95 సంవత్సరాల వయస్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరారు. బీహార్ కు చెందిన రాజకుమార్ వైశ్యా ప్రస్తుతం జార్ఖండ్ లో ఉన్న కోడెర్మా అనే ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైరయ్యారు. ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్న చిరకాల కోరిక ఆయనది. దీంతో నలందా సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎకానమిక్స్ చదివేందుకు దరఖాస్తు చేశారు. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి సమస్యలను ఎందుకు నిర్మూలించలేకపోతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకే తాను ఎకనామిక్స్ చదవాలనుకుంటున్నానని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం మాత్రమే తన లక్ష్యం కాదని, అధ్యయనంతో విజ్ఞానం పెంచుకోవాలనుకుంటున్నానని రాజకుమార్ అన్నారు.

  • Loading...

More Telugu News